‘వారణాసి’తో యావత్‌ దేశం గర్వపడుతుంది – మహేష్ బాబు

‘వారణాసి’తో యావత్‌ దేశం గర్వపడుతుంది – మహేష్ బాబు

Published on Nov 16, 2025 8:00 AM IST

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు వారణాసి సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. శనివారం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ మూవీ టైటిల్‌, స్పెషల్‌ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మిమ్మల్ని (ఫ్యాన్స్) కలుసుకుని చాలా రోజులైంది. ఇలా ఈ ఈవెంట్‌లో కలుసుకోవడం సంతోషంగా ఉంది. నాన్న కృష్ణగారు ఎప్పుడూ నాతో ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి’ అని మహేష్ బాబు తెలిపారు.

మహేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్‌. దీనికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తాను. మరీ ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తాను. ‘వారణాసి’ విడుదలైనప్పుడు ఈ మూవీ చూసి, యావత్‌ దేశం గర్వపడుతుంది’ అని మహేష్ చెప్పుకొచ్చారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు