పాపులర్ కమెడియన్ సునీల్ హీరోగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హీరో ఒకప్పుడు నాకు విలన్ పాత్రలు పోషించాలని ఉండేది అంటున్నాడు. ప్రముఖ రేడియో స్టేషన్లో మాట్లాడుతూ నాకు విలన్ పాత్రలంటే ఇష్టం. నేను మొదటగా ఇండస్ట్రీకి విలన్ అవుదామని వచ్చాను. ప్రేక్షకులు నన్ను కమెడియన్ గా అంగీకరించారు. అలా హీరోగా చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. సునీల్ తన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూలరంగడు’ చిత్రంతో యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫిబ్రవరి 18న విడుదలవుతున్న ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు.