తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ ఫుల్ పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈ రోజు (జనవరి 20) ఆయన పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు వేడుకకు మీడియా వారిని పిలవడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ రాజమౌళి ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న ‘బాహుబలి’ సినిమాపై కృష్ణంరాజు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ” ప్రభాస్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’ సినిమాని నిర్మించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్వాలిటీతో ‘బాహుబాలి’ నిర్మిస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది”. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ సంస్థ విషయాలను కూడా తెలియజేశాడు . ” నేను త్వరలో ‘ఒక్క అడుగు’ సినిమాని నిర్మిస్తాను. దానిలో ప్రభాస్, నేను ఇద్దరం నటిస్తాం. ఈ సినిమా నిర్మాణం తరువాత నేను వరుసగా సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నాను. నేను ‘ప్రభాస్ తో ‘భక్త కన్నప్ప’ సినిమా తీయాలనుకుంటున్నాను”. అని అన్నాడు.
123తెలుగు.కామ్ తరుపున కృష్ణంరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.