డైరెక్షన్ చేస్తానంటున్న టాప్ ప్రొడ్యూసర్ కుమార్తె

డైరెక్షన్ చేస్తానంటున్న టాప్ ప్రొడ్యూసర్ కుమార్తె

Published on Dec 19, 2012 12:46 PM IST

priyanka-dutt
టాలీవుడ్లో భారీ సినిమాలు నిర్మించే నిర్మాత ఎవరు అని అడిగితే చెప్పే పేరు సి. అశ్వినీదత్. ఆయన వారసురాలిగా ‘బాణం’, ఓం శాంతి’ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియాంక దత్ నిర్మాతగా చేసిన మూడవ సినిమా ‘సారొచ్చారు’. రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి పరశురామ్ డైరెక్టర్. సారొచ్చారు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి మరియు తన ప్లాన్స్ గురించి ప్రియాంక దత్ మాట్లాడుతూ ‘ రవితేజ ఇలాంటి పాత్ర ఇంతకముందు ఏ సినిమాలోనూ చేయలేదు. రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు ప్లాన్ చేస్తున్నాను, అలాగే ఇంద్ర’ సినిమాని భారీ ఎత్తున హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాను’. నిర్మాతగానే కాకుండా డైరెక్షన్ అన్నా ఇష్టం, ఖచ్చితంగా ఓ సినిమాకి డైరెక్షన్ చేస్తానని’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు