ఆది హీరోగా నటించిన ‘లవ్లీ’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ముద్దు గుమ్మ శాన్వి. మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ భామ రెండవ సినిమా చెయ్యడానికి రెండు సంవత్సరాలు పట్టింది. కానీ సుశాంత్ తో చేసిన 2వ సినిమా ‘అడ్డా’ కూడా విజయం సాధించడంతో ప్రస్తుతం శాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి.
తాజాగా పేస్ బుక్ ద్వారా అభిమానులు తనని అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. ఇందులో ఓ అభిమాని టాలీవుడ్ లో మీరు ఏ హీరోతో పనిచెయ్యాలని అనుకుంటున్నారు? అని అడిగితే ‘టాలీవుడ్ లో ఎవరితోనైనా వర్క్ చెయ్యాలి అంటే అల్లు అర్జున్ తో నటించాలని ఉంది. త్వరలోనే ఆ ఆఫర్ నాకు వస్తుందని ఆశిస్తున్నానని’ సమాధానం ఇచ్చింది. అలాగే శాన్వి తన డ్రీం రోల్స్ గురించి చెబుతూ ‘ప్రత్యేకమైన డ్రీం రోల్స్ ఏం లేవు, కానీ నాకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి చాన్స్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఒకవేళ చాన్స్ వస్తే యాక్షన్ తరహా పాత్రల్లో కనిపిస్తానని’ చెప్పింది.
ప్రస్తుతం శాన్వి శశాంక్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా త్వరలో ఆది హీరోగా సెట్స్ పైకి వెళ్లనున్న ‘ప్యార్ మే పడిపోయా’ సినిమాలో నటించనుంది.