ఎవర గ్రీన్ స్టార్ డా. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమను, అభిమానులను మరియు తన కుటుంబ సభ్యులను వదిలి తిరిగిరాని పరలోకాలకు పయనమయ్యారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని అభిమానుల సదర్శనార్ధం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం అక్కడే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఏఎన్ఆర్ చేతుల మీద పెరిగడమే కాకుండా, ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే సుమంత్ ఆయన ఇకలేరు అనే విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు.
తాతయ్యతో మధుర స్మృతుల్ని గుర్తు చేసుకున్న సుమంత్ ‘ ఏఎన్ఆర్ గారి సినిమాల్లో నాకు బాగా ఇష్టమైంది ‘దేవదాసు’. ఆయన తప్ప ఆ పాత్రను పర్ఫెక్ట్ గా చేయగల నటుడు ఇండియన్ హిస్టరీలోనే లేడు. ఇక రాడు కూడా.. దేవదాసుని ఇప్పటి ట్రెండ్ కి మార్చి రీమేక్ చేయాలని, ఆ రీమేక్ లో నేను నటించాలని ఉంది. అది ఒక సాహసమే కానీ చేస్తాను. బాలీవుడ్ లో మోడ్రన్ దేవదాసు వచ్చినప్పటికీ మనకు దగ్గరైనంతగా ఇంకెవరికీ దేవదాసు దగ్గర కాలేదు. ఇక్కడ మోడరన్ దేవదాసు రావాలి. అందుకు నేను ప్రయత్నం చేస్తానని’ అన్నాడు.