కామెడీ పాత్రలు చేయాలనుంది అంటున్న కాజల్

కామెడీ పాత్రలు చేయాలనుంది అంటున్న కాజల్

Published on Jan 27, 2012 12:48 PM IST


బిజినెస్ మేన్ చిత్రం భారీ విజయం సాధించడంతో కాజల్ అగర్వాల్ చాలా అనధంగా ఉంది. ఆమె ఈ సినిమా మంచి నటన కనబరచడమే కాకుండా, అందాలు కూడా బాగానే ఆరబోసింది. మీకు ఎలాంటి పాత్రలంటే ఇష్టం అని అడగగా తనకు కామెడీ సినిమాలో నటించాలంటే ఇష్టం అని చెప్పింది. అనుకోకుండా నాకు ఇప్పటి వరకు అన్ని యాక్షన్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చాయి అని, మొదట్లో నాకు యాక్షన్ సినిమాలు చేయాలంటే అంతగా ఇష్టం ఉండకపోయేది.

సినిమాలు చేసే కొద్ది మెల్లిగా వాటిని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. బిజినెస్ మేన్ చిత్రంలో ఫైట్స్ నాకు బాగా నచ్చాయి. కామెడీ పాత్రలు చేయాలంటే చాలెంజ్ లాంటిది నేను అవి చేయడానికి ఇష్టపడతాను. భవిష్యత్తులో అలంటి పాత్రలు వస్తే తప్పక చేస్తాను అని కాజల్ అంటుంది. కాజల్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సరసన చేయబోతుంది. కాజల్ కోరిక భవిష్యత్తులో నెరవేరాలని ఆశిద్దాం.

తాజా వార్తలు