నేను దేవుణ్ణి ఎప్పుడు రెండు కోరికలు కోరుకుంటాను – తమన్నా

tamannah

దక్షిణ భారత దేశంలోని హీరోయిన్స్ లలో అత్యంత ఆదరణ పొందిన నటి తమన్నా. తను చేసిన హార్డ్ వర్క్, నిజాయితీ తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. ఈ మద్య ఒక పత్రికతో మాట్లాడుతూ ‘ నాకు ఏది ఇష్టమో అదే చేస్తాను. నేను కేవలం హార్డ్ వర్క్ మాత్రమే చేస్తాను. నేను ఎప్పుడు దేవున్ని ఒక్కటే కోరుకుంటాను. మొదటిది నేను ఎంత తిన్న నా బరువు పెరగకుండా వుండాలని, అలాగే రెండవది నేను మరో జన్మలో కూడా ఇదే కుటుంబంలోనే పుట్టాలని’ అని చెప్పింది. ప్రస్తుతం తను సైఫ్ అలీ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో నటిస్తోంది. అలాగే తను చంద్రముఖి లాంటి పాత్రని చేయాలనీ ఉందని, మధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ లకు గుర్తింపు తెచ్చిన స్పెషల్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంది.

Exit mobile version