ఈ రెస్పాన్స్ చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది : సుదీప్


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఈగ” చిత్రంతో కన్నడ హీరో సుదీప్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. తెలుగు టాప్ హీరోలు అయిన నాగార్జున మరియు మహేష్ బాబుల దగ్గరనుంచి ప్రశంశలలే కాకుండా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి కూడా సుదీప్ ప్రశంశలు అందుకున్నాడు. అలాగే అందరి సినీ విమర్శకుల నుంచి కూడా అతని నటనకి మంచి కితాబులు అందుకున్నాడు. ఇటీవలే మొదలైన ‘ఈగ’ సక్సెస్ టూర్లో ఈగ టీంతో పాటు సుదీప్ కూడా పాల్గొన్నారు. ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న స్పందన చూసి సుదీప్ ఆశ్చర్యపోయాడు. ఈ స్పందనతో అతను తన జీవితంలో ఇప్పటి వరకు పొందని ఒక అద్భుతమైన అనుభవానికి లోనై ఉంటాడని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

“ఈ టూర్లో ఒక కొత్త అనుభూతికి లోనయ్యాను, ఇంకా ప్రేక్షకుల ప్రేమ మరియు అభిమానాన్ని గెలుచుకోవాలని ఉంది కాని ముందే ఒప్పుకున్న పనుల వల్ల ప్రస్తుతం బెంగుళూరు వెళ్తున్నాను. ప్రేక్షకులు చూపించిన అభిమానంతో నాలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈగ చిత్రం సక్సెస్ తో ఇక ముందు మంచి పాత్రలు ఎంచుకుంటూ మరియు కెరీర్ చివరి వరకు అందరితో కలిసి పనిచేస్తానని’ కిచ్చ సుదీప్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇటీవలే కన్నడంలో విడుదలైన ‘కిచ్చ హుచ్చ’ చిత్రాన్ని ‘కిచ్చ’ పేరుతో తెలుగులో అనువస్తున్నారు మరియు చాలా మంది తెలుగు నిర్మాతలు తనని తమ సినిమాలో నటించాలని అడుగుతున్నారు. కానీ సుదీప్ తెలుగు సినిమాలో విలన్ గా ఒప్పుకుంటాడ లేక కనడంలో హీరోగానే సినిమాలు చేస్తూ భవిష్యత్తులో బిజీ అవుతారా? అనే ప్రశ్నకి కాలమే సమాధానమివ్వాలి.

Exit mobile version