స్వతహాగా వేరే రాష్ట్రానికి చెందిన వాడైనా తెలుగు భాషనీ ఎంతో క్షుణ్ణంగా నేర్చుకొని నటుడిగా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్. అలాంటి ప్రకాష్ రాజ్ ఓ సినిమా వల్ల తనని తాను మార్చుకున్నానని చెప్పారు. ఇంతకీ ఇదంతా ఎ సినిమా వల్ల జరిగింది అనుకుంటున్నారా?.. ఇంకే సినిమా వెంకటేష్ – మహేష్ బాబు అన్నదమ్ములుగా తెరకెక్కిన ‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమా ఆడియో వేడుక నిన్న ఘనంగా జరిగింది. ఈ వేదికపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ ఈ సినిమాకి ముందు నాలో కోపం, అసహనం లాంటి కొన్ని చెడు గుణాల నుండి వదులుకొని నన్నునేను మార్చుకున్నాను. ఈ సినిమాలో ‘మంచి వాడు అనిపించుకుంటే మనిషవుతాడు’ అనే డైలాగ్ ఎంతో మందిని ప్రభావితం చేస్తుందని’ అన్నాడు.
శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సమంత, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.