తెలుగు సినిమాలో అగ్రనటులందరితోనూ కేవలం మూడేళ్ళ వ్యవధిలో నటించి మరపురాని ఫామ్ ను సొంతంచేసుకుంది తమన్నా . తమిళంలో కార్తీ, ధనుష్ మరియు అజిత్ ల సరసన నటించడమే కాకుండా తెలుగులో టాప్ పొజిషన్ లో వున్న ఆరుగురు హీరోల సరసన నటించడం విశేషం
మీరు ఎటువంటి సినిమాలను అంగీకరించడానికి ఇష్టపడతారు అన్న ప్రశ్నకు “కెరీర్ విషయంలో నేను నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను. వాటిపరిణామం ఎలా వున్నా సంతోషంగా స్వీకరిస్తాను. మిగిలిన విషయాలలో కుటంబ సభ్యుల, స్నేహితురాళ్ళ సలహాలను తీసుకుంటాను. చివరికి ఏమైనా మనకు కావలసినది ఆనందమేకదా” అని తెలిపింది
ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ మహేష్ సరసన ఆగడు లో నటిస్తుంది. మరో రెండు హిందీ సినిమాలలో సైతం నటిస్తున్న ఈ భామ త్వరలో రాజమౌళి బాహుబలి షూటింగ్ లో పాల్గోనుంది