దేవుడి మీద సినిమా తీస్తా : పూరి జగన్నాధ్

దేవుడి మీద సినిమా తీస్తా : పూరి జగన్నాధ్

Published on Oct 15, 2012 2:34 PM IST


కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న పూరి జగన్నాధ్ హే భగవాన్ అనే సినిమా తీస్తా అంటున్నాడు. దేవుడున్నాడని నమ్ముతాను కానీ దేవుడుకి మొక్కను అంటున్న పూరి జగన్నాధ్ ఒక్కసారి మాత్రమే దేవుడ్ని మొక్కుకున్నాను అంటున్నాడు. ఎప్పటికైనా దేవుడి సినిమా ఒక పుస్తకం రాస్తానని ఆ పుస్తకం నిండా దేవుడికి సంబందించిన ప్రశ్నలే ఉంటాయని అంటున్నాడు. దేవుడి మీద పుస్తకంతో పాటుగా ఒక సినిమా తీయబోతున్నట్లు దానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసానని ఆ సినిమా పేరు ‘హే భగవాన్’ అని ఆ సినిమాని హిందీలో తీస్తానని అంటున్నాడు. తన థియరీ చెప్పి వేరే వాళ్ళ ఇగో హర్ట్ చేయనని అంటున్నాడు. దేవుళ్ళని మొక్కడం మనేయ్యమనేదే ఈ చిత్ర కాన్సెప్ట్ అంటున్నాడు పూరి.

తాజా వార్తలు