నా అంతట నేనే ఆ సినిమాలు ఒదులుకున్నాను

నా అంతట నేనే ఆ సినిమాలు ఒదులుకున్నాను

Published on Nov 4, 2012 12:43 PM IST


‘లీడర్’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ ఈ మధ్య కాలంలో అవకాశాలాలను దక్కించుకున్నట్లే దక్కించుకొని చేజార్చుకుంటోంది. ఉదాహరణకి వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘షాడో’, కార్తీ సినిమా ‘బిర్యానీ’ మరియు అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలలో మొదట రిచా ఎంపికయ్యారు, ఆ తర్వాత ఆ సినిమాల నుండి తప్పుకున్నారు. ఇలా క్రేజీ సినిమాలు వదులుకోవడంతో రిచాపై పలు వదంతులు వినిపిస్తున్నాయి. వాటి పై స్పందించిన రిచా మాట్లాడుతూ ‘ ఆ సినిమాలను నా అంతట నేనుగా వదులుకున్నాను. వీటి పై వస్తున్న పుకార్లను పట్టించుకోకండి. ఒక సినిమాని ఎన్ని కారణాల వల్ల అంగీకరిస్తామో, అలాగే ఒక సినిమాని ఒదులుకోవడానికి కూడా అన్నే కారణాలు ఉంటాయని’ ఆమె అన్నారు. రిచా ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ మిర్చి’ మరియు రవితేజ సరసన ‘సారొచ్చారు’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే త్వరలోనే ప్రారంభం కాబోయే నాగార్జున ‘భాయ్’ సినిమాలో నటించనుంది.

తాజా వార్తలు