టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రానా యువరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమాని కథని గుణశేఖర్ 7 సంవత్సరాల క్రితమే చెప్పాడని రానా అంటున్నారు.
‘ 7 సంవత్సరాల క్రితమే గుణశేఖర్ నాకు రుద్రమదేవి కథ చెప్పాడు. ఇలాంటి ఓ చారిత్రాత్మక సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని’ రానా అన్నాడు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్యా మీనన్, కేథరిన్, బాబా సెహగల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.