టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే తరహా పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. అలాంటి మహేష్ ని సినిమా సక్సెస్ ఫార్ములా ఏమిటీ అని అడిగితే ‘ సక్సెస్ ఫార్ములా అంటూ లేమీ లేదు , ఉండదు కూడా. నేను పోకిరి సినిమా హిట్ అయిన తర్వాత అదే ఫార్ములా అనుకోని అదే ఫార్మాట్ లో కొన్ని సినిమాలు చేసాను కానీ అవి సక్సెస్ అవ్వలేదు. నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే మనం చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి, 100% కష్టపడి పనిచెయ్యాలి. అలా చేస్తే విజయం మనల్ని వరిస్తుంది, లేదా అది, ఇది అనే ఫార్ములా ఫాలో ఆయితే సక్సెస్ మనల్ని వరించదు. వెంకీ గారితో కలిసి మల్టీ స్టారర్ పనిచేయడం చాలా ఆనందంగా ఉందని’ మహేష్ అన్నాడు.
వెంకటేష్ – మహేష్ అన్నదమ్ములుగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆడియో వేడుక ఈ రోజు నానక్రాంగూడాలోని రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.