మహేష్ బాబు తనకి రిమేక్ లు చేసే విషయం మీద పెద్ద ఆసక్తి లేదని చెప్పారు. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు మాట్లాడుతూ ” మా నాన్నగారి చిత్రాలలో ఏది నేను రిమేక్ చెయ్యాలని అనుకోవట్లేదు నా ఉద్దేశం ప్రకారం ఏదయినా చిత్రాన్ని రిమేక్ చెయ్యటం వల్ల దాని గొప్పతనానికి భంగం కలగవచ్చు. నన్ని జేమ్స్ బాండ్ పాత్రలో జనం చూడగలరని నేను అనుకోవట్లేదు” అని అన్నారు.
మణి రత్నం మరియు శంకర్ వంటి దర్శకులు మీ దగ్గరకి వచ్చి రిమేక్ చెయ్యమని అడిగితే ఎం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు ” మీ లాంటి దర్శకుల నుండి నేను ఇది ఆశించట్లేదు అని చెప్తా” అని జవాబు ఇచ్చారు. “బిజినెస్ మాన్” చిత్ర విజయంతో మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు ఇక ముందు కూడా మంచి చిత్రాలు చేస్తా అని చెప్పారు ” నా గురించి రాం గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ కన్నా మంచి నటుడు అని చెప్పటం సంతోషం కలిగించినా అంతటి భారాన్ని నేను మోయలేను అది నిజమని నన్ను నేను మోసగించుకోలేను కూడా ” అని చెప్పారు