బాగా చదువుకున్న యువకుడిని సీఎం అభ్యర్థిగా నియమిస్తా – రజనీకాంత్

బాగా చదువుకున్న యువకుడిని సీఎం అభ్యర్థిగా నియమిస్తా – రజనీకాంత్

Published on Mar 12, 2020 11:29 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఈ రోజు కోసం గత కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రజిని తన పార్టీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఎట్టకేలకు ఈ రోజు చెప్పారు. రజనీ ఈ రోజు తన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… తనకు సీఎం అవ్వాలనే ఆసక్తి లేదని తానూ కేవలం పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమే ఉంటానని.. బాగా చదువుకున్న యువకుడిని సీఎం అభ్యర్థిగా నియమిస్తామని సూపర్ స్టార్ తెలిపారు. రజినీ ఇలాంటి నిస్వార్థమైన ప్రకటన చేసినందుకు తమిళనాడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అయితే రజిని సీఎం అభ్యర్థిగా ఉండటానికి ఇష్టపడటం లేదని ఆయన అభిమానులు చాలా మంది నిరాశ చెందుతున్నారు.

ఇక రజిని ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన పొలిటికల్ పార్టీ నిర్మాణాన్ని కూడా నడిపిస్తున్నారు. ఇప్పటికే వ్యక్తిగత సిబ్బందితో తమిళనాడు వ్యాప్తంగా పార్టీ వ్యవస్థాగత నిర్మాణ పనుల్ని ఒక కొలిక్కి తెచ్చారు. దీంతో ఎన్నాళ్ళగానో రజనీ పార్టీ హడావుడి కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఇతర రాజకీయ వర్గాలన్నీ కూడా రజనీ తన పార్టీ విధి విధానాలను ఎలా రూపొందించారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఇకపోతే సూపర్ స్టార్ ప్రస్తుతం శివ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకానుంది.

తాజా వార్తలు