నేను ఆమెలా యాక్షన్ సీన్స్ చేయలేను – సమంత

నేను ఆమెలా యాక్షన్ సీన్స్ చేయలేను – సమంత

Published on Jan 10, 2013 1:30 PM IST

samantha
కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి దిగుమతి అయిన అందాల భామ సమంత ఇక్కడ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సమంత సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రేపు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత ప్రముఖ వార పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ నేను పక్కా కమర్షియల్ సినిమాల్లోనే నటించాలనే రూల్స్ ఏమీ పెట్టుకోలేదు. కథ నచ్చితే ఆర్ట్ ఫిల్మ్ అయినా చేస్తాను. నేను సినిమాలకు స్వస్తి చెప్పే లోపల ఇలాంటి తరహా సినిమా చేయలేదే అనే భావన ఉండకూడదు. అలాగని ఎంజెలినా జోలీ చేసిన ‘టాంబ్ రైడర్’ లాంటి యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాని చేయలేను ఎందుకంటే ఆలాంటి సినిమాలకు తగ్గ శరీర ఆకృతి నాకు లేదని’ ఆమె అన్నారు.

‘ఆటోనగర్ సూర్య’, ‘జరదస్త్’, ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ మూవీ, అలాగే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మూవీలతో సమంత ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు