సూర్య అంటే ఎవరో తెలియదంటున్న కరీనా కపూర్

సూర్య అంటే ఎవరో తెలియదంటున్న కరీనా కపూర్

Published on Apr 10, 2014 12:50 PM IST

surya_kareena
సౌత్ ఇండియాలో తమిళ స్టార్ సూర్య అంటే తెలియని వారు ఉండరు. అలాగే బాలీవుడ్ లో కూడా చాలా మంది బిగ్గెస్ట్ స్టార్స్ కి కూడా సూర్య అంటే తెలుసు. కానీ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ మాత్రం సూర్య అంటే ఎవరో నాకు తెలియదని అంటోంది.

అసలు విషయంలోకి వెళితే సూర్య – సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో ‘అంజాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్ ని బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ పై షూట్ చేసారు. ఈ సినిమాలోని మరో పాటకి కరీనా కపూర్ ని తీసుకున్నారని కొద్ది రోజుల నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై స్పందించిన కరీనా కపూర్ ‘సౌత్ లో ఏ సినిమాకి సైన్ చేయలేదు. చెప్పాలంటే నాకు సూర్య, లింగుస్వామి అంటేనే ఎవరో తెలియదు మరియు వాళ్ళని ఇప్పటి వరకూ చూడలేదు. నాకు హిందీ సినిమాలు తప్ప సౌత్ అయినా, హాలీవుడ్ అయినా అస్సలు ఇంట్రెస్ట్ లేదని’ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ వార్తా విన్న కోలీవుడ్ వర్గాలు, బాలీవుడ్ వర్గాలు షాక్ అయ్యాయి.

తాజా వార్తలు