బాహుబలి కోసం నేను ఆడిషన్ కి వెళ్ళలేదంటున్న లావణ్య

Lavanya
‘అందాల రాక్షసి’ ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరు లావణ్య త్రిపతి. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మొదలుకానున్న ‘బాహుబలి’ సినిమా పై వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేసింది. ‘బాహుబలి’ కోసం లావణ్య మీద ఆడిషన్ చేశారని, త్వరలోనే ఆమె టీంతో కలువనుందని ఓ ప్రముఖ పత్రిక వారు రాశారు. ఈ విషయంపై లావణ్య మాట్లాడుతూ ‘ ఎస్.ఎస్ రాజమౌళి గారి ‘బాహుబలి’ సినిమా కోసం నేను ఎలాంటి ఆడిషన్ కి వెళ్ళలేదు. అసలు ఈ రూమర్స్ అన్నీ ఎలా వచ్చాయో తెలియడం లేదు. అందాల రాక్షసి తర్వాత నేను ఓకే చేసిన ఒకే ఒక్క చిత్రం వీరూ పోట్ల గారిది మాత్రమే, ఫుల్ కామెడీ ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ ఇది, ఇందులో నా పాత్ర కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని’ అంది. ఇటీవలే లావణ్య తిరుపతిలో వీరూ పోట్ల టీంతో కలిసింది. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తూ, అలాగే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

Exit mobile version