శ్రీ దేవి ఆ ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేదట

శ్రీ దేవి ఆ ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేదట

Published on Aug 12, 2013 5:31 AM IST

srideviఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఎంతోమందికి కళల రాణిగా కొనసాగుతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి చేసిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ అందాల భామని మీ జీవితంలో అత్యంత సంతోషకర విషయం ఏంటని అడిగితే శ్రీ దేవి సమాధానమిస్తూ ‘ నేను ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లాను. అదే రోజు ముంబై లో ఓ బాంబు పేలుడు జరిగింది. ఆ పేలుడు గురించి తెలిసిన బోనీ కంగారు పడిపోయి మొదట నేనున్నా హొటల రూంకి వెళ్ళాడు. అక్కడ లేకపోవడంతో అక్కడి నుంచి కంగారు పడుతూ నేను షూటింగ్ చేస్తున్న స్టూడియోకి వచ్చాడు. అక్కడ నన్ను చూసిన తర్వాత బోనీ ముఖంలో కనిపించిన సంతోషం ఇప్పటికీ మర్చిపోలేదు. అది గుర్తొస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందని’ ఆమె తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు