ఇప్పుడున్న కథానాయికలలో లేజండ్రీ నటుడు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుతో నటించే అవకాశం అందాల భామ సమంతకి దక్కింది. సమంత హీరోయిన్ గా నటించిన ‘మనం’ సినిమా ఎఎన్ఆర్ గారు నటించిన ఆఖరి సినిమా. ఆ సినిమా కంటే ముందు కూడా సమంత చాలా సార్లు ఎఎన్ఆర్ ని కలిసారు.
సమంత అభిమాని ఎఎన్ఆర్ తో పనిచేసిన అనుభవం గురించి అడిగితే సమంత సమాధానమిస్తూ ‘ నేను ఎప్పటికీ ఎఎన్ఆర్ గురించి మర్చిపోలేను. ఆయనలో ఉన్న ఆసక్తి, జోష్ మనల్ని ఆకర్షిస్తుంది. నాకు సీన్ లేకపోయినా సెట్ లో కూర్చొని ఆయన చేసే సీన్స్ చూసే దాన్ని. అయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను. అలాగే ఏ మాయ చేసావే సినిమా చూసి నన్ను మెచ్చుకున్న మొదటి వ్యక్తి ఆయనే. అప్పుడు ఎఎన్ఆర్ గారు తనకి సావిత్రి గారు గుర్తొచ్చారని చెప్పారు. అది నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్’ అని చెప్పింది.
‘మనం’ సినిమాలో ఎఎన్ఆర్ తో పాటు నాగార్జున, నాగ చైతన్య, శ్రియ సరన్ లు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సమంత హైదరబాద్ లో జరుగుతున్నా ‘రభస’ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటోంది.