ఆయనకి పోటీగా నటించగల అనుభవం ఉందంటున్న గోవా బ్యూటీ

Ileana
గత సంవత్సరం బాలీవుడ్ కి పరిచయమై అక్కడ విజయాన్ని చవి చూసిన గోవా బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఈ భామ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘తనకి బాలీవుడ్ కందల వీరుడు సల్మాన్ ఖాన్ తో నటించాలని ఉందనే’ తన చిరకాల వాంఛని బయటపెట్టింది. ఇది విన్న చాలా మంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారని తెలిసిన ఇలియానా స్పందిస్తూ ‘ స్వతహాగా నేను సల్మాన్ ఖాన్ కి వీరాభిమానిని. నటిగా ఆయనకి గట్టి పోటీ ఇవ్వగల అనుభవం నాకు ఉంది. అలాంటప్పుడు ఆయనతో నటించాలని అనుకోవడంలో తప్పేముంది. ఆ అవకాశం నాకు వస్తే నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని ఆమె అన్నారు. షాహిద్ కపూర్ తో ఓ సినిమా చేస్తున్న ఇలియానా ప్రస్తుతం తెలుగు సినిమా స్క్రిప్ట్స్ కూడా వింటోంది. ఈ సంవత్సరం ఆమె నుండి తెలుగులో కూడా ఓ సినిమాని ఆశించవచ్చు.

Exit mobile version