డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను

డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను

Published on Dec 19, 2012 8:33 AM IST

hansika-motwani-30
సినిమా ప్రపంచం అంటేనే రంగులమయం, అందులోనూ సినిమా వారు ప్రతీది గ్రాండ్ గా ఉండాలనుకొంటారు. ఖరీదైన బహుమతులు, కార్లు ఇలా చాలా వాటికి విరివిగా డబ్బు ఖర్చు పెడుతుంటారు. కానీ హన్సిక మాత్రం ఇందుకు విరుద్ధం అంటుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అంటుంది. ప్రస్తుతం హన్సిక తమిళ్లో డిమాండ్ బాగా ఉంది. అందుకని డబ్బు కూడా కొదవలేదు. చాలా చిన్న వయసులోనే హీరొయిన్ అయిన హన్సిక డబ్బు ఖర్చు విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటుందట. 10 రూపాయల విలువ గల వస్తువుని 100 రూపాయలు పెట్టి కొంటె సంతోషం ఏమి రెట్టింపు అవదు కదా, కొంతమంది పుట్టిన రోజు వేడుకలకి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. అల చేయడం తప్పు కాదు కానీ అందులో కొంత అనాధ పిల్లలకు ఇస్తే బావుంటుందని హన్సిక అభిప్రాయ పడుతుంది. ఇంత అందమైన అమ్మాయికి అందమైన మనసు కూడా ఉంది కదా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు