ప్రేమలో పడేంత తీరిక లేదు – శృతిహాసన్

ప్రేమలో పడేంత తీరిక లేదు – శృతిహాసన్

Published on Apr 12, 2014 1:55 PM IST

Shruthi-hasan
శృతిహాసన్ కి ఈ యేడాది బాగా కలిసోచ్చందనే చెప్పాలి. సంక్రాంతికి రామ్ చరణ్ సరసన ఎవడు సినిమా ద్వారా హిట్ కొట్టిన ఈ భామ ఇప్పుడు రేస్ గుర్రం సినిమాకు మొదటిరోజునుండి హిట్ టాక్ ని సంతరించుకుంది. కెరీర్ లో సినిమాల గురించి తప్ప వేరే వాటిపై ఆలోచన పెట్టె సమయం లేదట

ఇటీవలే ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని, నా డైరీ చదివిన వాడెవడూ నన్ను ప్రేమించడానికి సాహసం చేయరని అయినా ప్రేమలో పడే అంత తీరిక తనకి లేదని చెప్పింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఈ భామ చేసిన నృత్యాలకు ప్రశంసలను అందుకుంటుంది

ప్రస్తుతం వెల్కమ్ బ్యాక్, గబ్బర్, పూజై మరియు మరో సినిమాలో ఈ భామ బిజీగా వుంది. అంతేకాక వెంకట్ ప్రభు – సూర్య ల కలయికలో రానున్న సినిమాలో శృతిని నాయికగా ఎంచుకున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త అధికారికంగా ప్రకటించాల్సివుంది

తాజా వార్తలు