First Posted at 03.55 on Apr 16th
తాప్సీ బాలీవుడ్లో నటించిన మొదటి సినిమా ‘చష్మే బద్దూర్’ విజయం సాదించడంతో తను చాలా సంతోషంగావుంది. ఈ సినిమాకిగానూ తనకు వచ్చిన ప్రశంసలు ఆమెను ఆశ్చర్యంలో మున్చేత్తాయ్. ఆమె ఇప్పుడు పరమానంద దశలో ఉంది అనడం అతిశయోక్తి కాదు. ఈ సినిమా విడుదలకు ముందు తాను కొన్ని హిందీ కధలు విన్నానని కానీ ఏది ఒప్పుకోలేదని తెలిపింది. “నా దగ్గరకు కొంతమంది దర్శకులు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఒక్క సినిమా హిట్ అవ్వగానే వచ్చిన ప్రతీ సినిమాని అంగీకరించలేను. నిజానికి నేను జూన్ వరకూ కాస్త బిజీగా ఉండటంతో తరువాత బాలీవుడ్ పై నిర్ణయం తీసుకుంటానని” చెప్పింది. ప్రస్తుతం కేరళలో ‘సాహసం’ షూటింగ్లో పాల్గుంటున్న ఈ భామ త్వరలో వెంకి సరసన ‘షాడో’ సినిమాలో కనపడనుంది. ఈ రెండు సినిమాలే కాక విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఒక తమిళ్ సినిమా మరియు రాఘవ లారెన్స్ ముని 3 సినిమాలో నటిస్తుంది.