టాలీవుడ్లో తన డైలాగ్స్ మరియు వెరైటీ కథలతో సినిమాలు తీసి డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కి ఆపిల్ అంటే పిచ్చి అంటున్నారు. కానీ అది తినే ఫ్రూట్ ఆపిల్ అనుకుంటే మాత్రం అరటి తొక్క మీద కాలేసి బురద గుంటలో పడ్డట్టే. పూరికి ఇష్టమైంది ఆపిల్ కంపెనీ వారు విడుదల చేసే గాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం అని అంటున్నారు. ఆపిల్ గురించి ఇంకేమి అన్నారో ఆయన మాటల్లోనే విందాం ‘ నాకు ఆపిల్ బ్రాండ్ వారు రూపొందించే ఎలాంటి గాడ్జెట్ అయినా చాలా ఇష్టం. ఉదాహరణకి ఐ ఫోన్, ఐ ప్యాడ్ మరియు ఐ మాక్స్ కంప్యూటర్స్ .మొదలైనవి. ఆపిల్ ప్రొడక్ట్స్ అలా మార్కెట్లోకి రాగానే ఇలా కోనేస్తుంటాను. ఎంతలాకొంటాను అంటే ఒకే ప్రోడక్ట్ ని 5 మోడల్స్ లో వదిలితే ఐదూ కోనేస్తాను. ఆపిల్ ప్రొడక్ట్స్అంటే నాకు అంత పిచ్చి. అందరికీ రకరకాల ఇష్టాలు ఉంటాయి, కానీ ఒక్కసారి ఆపిల్ పిచ్చి తగులుకుందంటే ఇంకొక దాని మీదకి మనసు వెళ్ళదు అని’ పూరి అన్నారు.
పూరి జగన్నాథ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా భారీ అంచనాల నడుమ ఈ నెల 18న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత పూరి – బన్ని కాంబినేషన్లో ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాని తక్కువ టైంలో పూర్తి చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నారు.