‘ బాలకృష్ణ ‘ పాత్ర అసూయ కలిగించిందన్న’ మోహన్ బాబు ‘

‘ బాలకృష్ణ ‘ పాత్ర అసూయ కలిగించిందన్న’ మోహన్ బాబు ‘

Published on May 31, 2012 12:30 AM IST

శిల్ప కళా వేదికలో జరిగిన ఊ కొడతార ఉలిక్కి పడతార చిత్రం ఆడియో వేడుకలో ‘ కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు’ మాట్లాడుతూ “ ‘ ఊ కొడతారా ఉలిక్కి పడతారా ‘ చిత్రంలో ‘ నందమూరి బాలకృష్ణ ‘ పాత్ర చూసి బాలయ్య మీద అసూయ కలిగిందన్నారు. ఎంతో అనుభవం ఉన్న బాలయ్య బాబు ఈ చిత్రం లో చాలా విభిన్నమైన పాత్ర పోషించారు అని చెప్పారు.ఈ చిత్రం తెరకెక్కించిన విధానం చాలా ఆనందం కలిగించిందని అన్నారు. బాలయ్య బాబు పాత్ర అద్భుతం గా ఉంటుందని, అలాంటి మంచి పాత్ర తనకు రాలేదని బాలయ్య బాబు మీద కొంత అసూయ కలిగిందని అన్నారు. ఈ చిత్రం ఒప్పుకొని ఎంతో గొప్పగా రావడానికి సహకరించిన బాలయ్య బాబు కి కృతఙ్ఞతలు తెలియజేసారు. తన తనయుడు మంచు మనోజ్ ని పేరు ప్రఖ్యాతలున్న హీరోగా ఎదిగేలాగా ఆశీర్వదించమని బాలయ్య బాబు ని కోరారు “.
మోహన్ బాబు గారు మాట్లాడిన దానికి బాలయ్య బాబు ఇలా స్పందించారు ” ఈ చిత్రం లో తను కూడా నటించడం చాల ఆనందంగా ఉందన్నారు. తన కుటుంబానికి, మోహన్ బాబు గారి కుటుంబానికి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉందన్నారు. దర్శకుడు రాజ తన పాత్రని తీర్చిదిద్దన విదానం చాల బాగుందని , చాలా ఉత్సాహంగా ఈ పాత్ర లో నటించానని చెప్పారు. మనోజ్ మంచి నటుడని ,ఖచ్చితంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నటుడిగా వేలుగొందుటాడని అన్నారు”. ఈ చిత్ర ఆడియో వేడుకకి చిత్ర రంగం లోని ప్రముఖులు డా.దాసరి నారాయణ రావు, కె.రాఘవేంద్ర రావు, బి.గోపాల్, నవదీప్, నాని, శర్వానంద్, రాజ, నిఖిల్, తాప్సీ, వంశీ ఫైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి బొబో శశి సంగీతాన్ని అందించారు.

తాజా వార్తలు