టాలీవుడ్ లో అగ్ర తారగా వెలుగొందుతున్న సమంత సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన సలహాని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నానని అంటోంది. ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉండవచ్చు, ఇంతకీ ఆ సలహా ఏంటో మీరే చదవండి. ‘దూకుడు’ చిత్ర చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు సమంతకి ఒక టిప్ ఇచ్చారంట ” చేసే ప్రతి సినిమాని నీ మొదటి సినిమా అనుకో మరియు మొదటి సినిమాకి ఎంత ఉత్సాహంతో పని చేస్తావో అదే ఉత్సాహంతో ప్రతి సినిమాకి పని చెయ్యి” అని చెప్పారంట.
ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ నేను ఒప్పుకునే ప్రతి సినిమాకి ఆయన ఇచ్చిన సలహానే ఫాలో అవుతున్నాను. ఈ సందర్భంగా ఇంత మంచి సలహా ఇచ్చినందుకు మహేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ ఇండస్ట్రీలో సమంత అంటే విజయానికి సింబల్ అని అనిపించుకుంటోంది. టాలీవుడ్లో ఇప్పటివరకు వరుసగా 4 హిట్లు తన ఖాతాలో వేసుకున్న సమంత చేతిలో భారీ చిత్రాలున్నాయి.