నేను నటున్ని, నిర్మాతని కాదు – రాజా రవీంద్ర

Raja-Ravindra
రాజా రవీంద్ర ఒకానొక సమయంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పెదరాయుడు’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రొడక్షన్ టీంలోకి అడుగుపెట్టిన రాజా రవీంద్ర పలువురు హీరోల డేట్స్ చూసుకునేవాడు. దాని వాళ్ళ అతను మళ్ళీ తెర వెనుకకి వెళ్ళిపోయాడు.

మళ్ళీ ప్రస్తుతం రాజా రవీంద్ర కొన్ని మంచి పాత్రల కోసం చూస్తున్నాడు. రాజా రవీంద్ర మాట్లాడుతూ ‘ నేను ప్రొడక్షన్ సైడ్ వెళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి. కానీ ముందు నేను నటున్ని, నిర్మాతని కాదు. ప్రస్తుతం మంచి పాత్రలు ఎమన్నా వస్తే చేయడానికి సిద్దంగా ఉన్నాను. కొన్ని పాత్రలు నటుడికి మంచి గుర్తింపుని, ఆఫర్లని తెచ్చి పెడతాయి. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అలాంటి కీలక పాత్రలను పోషించి సినిమా విజయంలో బాగమయ్యారు. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నాను’ అని మీడియాతో అన్నాడు.

రాజా రవీంద్ర ఇటీవలే ‘పైసా’ సినిమాలో కనిపించాడు. అలాగే త్వరలో రానున్న ‘భీమవరం బుల్లోడు’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version