ఈ వారం బిగ్గెస్ట్ రిలీజ్ కి వస్తున్న సాలిడ్ క్లాష్ చిత్రాల్లో వార్ 2 కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ సినిమా భారీ బుకింగ్స్ ని ఇపుడు చూపిస్తుంది. ఇదిలా ఉండగా వార్ 2 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ టార్గెట్ తెలుస్తుంది.
దీని ప్రకారం వార్ 2 చిత్రానికి ఏకంగా 300 కోట్లకి పైగా థియేట్రికల్ టార్గెట్ ఉందని తెలుస్తుంది. హిందీ, తెలుగు సహా ఓవర్సీస్ మార్కెట్ ఇంకా తమిళ్ తో కలిపి ఈ మొత్తం అన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ టార్గెట్ ఈ ప్రాజెక్ట్ కి ఈజీ అనే చెప్పొచ్చు.
హిందీలో ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో తెలుగులో కూడా ఎన్టీఆర్ మూలాన అదే రేంజ్ లో వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. వార్ 1 కే యావరేజ్ టాక్ తో నార్త్ మార్కెట్ లో ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే టాక్ మళ్ళీ వచ్చినా ఎన్టీఆర్ ఫ్యాక్టర్ డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. సో పెట్టుకున్న టార్గెట్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు.