పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓజి’ ఇప్పటికే అభిమానుల్లో ఎలాంటి సాలిడ్ హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ పవర్‌ఫుల్ లుక్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన చేసే యాక్షన్ వేరే లెవెల్‌లో ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు హిందీలో కూడా సాలిడ్ బజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. కాగా ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఛానల్ స్టార్ గోల్డ్ టీవీ అదిరిపోయే ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌తో వారు ఈ చిత్రానికి భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఓజి చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.