బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు హీరోగా నటించిన ‘హృదయ కాలేయం’ చిత్రం ఏప్రిల్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత అయిన సాయి రాజేష్ సామాజిక వెబ్ సైట్ ద్వారా దృవీకరించారు. గత సంవత్సరం కొన్ని వినూత్న పద్దతుల ద్వారా సంపూర్నేష్ బాబు క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు ఈ చిత్రంపై కొంతమేర నమ్మకం లేక పోయినప్పటికీ, సంపూర్నేష్ బాబు కు ఉన్న క్రేజ్ ద్వారా సొమ్ము చేసుకోవాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఓ తెలుగు హీరో పై వ్యగ్యంగానుగుణంగా నిర్మించారు, శ్రేయాస్ మీడియా మరియు దర్శకుడు మారుతి ఈ చిత్ర భాగస్వాములు గా ఉన్నారు