హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం క్రిష్-2 కోసం భారీ కసరత్తులు మొదలు పెట్టారు. ఆయన అంతర్జాతీయ ట్రైనర్ క్రిస్ గెతిన్ ని స్పెషల్ గా ముంబైకి రప్పించుకొని తన ట్రైనీగా పెట్టుకోనున్నారు. ఈ సినిమా కోసం కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. క్రిస్ గెతిన్ కోసం హృతిక్ నెలకు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఫెబ్రవరి నెలాఖరు నుండి క్రిస్ ఇక్కడికి రానున్నాడని సమాచారం. హృతిక్ నటించిన క్రిష్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. క్రిష్-2 తో మరో విజయాన్ని సాధించేందుకు ఈ ప్రతేక జాగ్రత్తలు
తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. రాకేశ్ రోషన్ దర్శకత్వం వహిస్తూ యాక్షన్ సన్నివేశాలకు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ రోషన్ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది 2012 ద్వితీయార్ధంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
నెలకు 20 లక్షలు ఖర్చు పెట్టనున్న హృతిక్
నెలకు 20 లక్షలు ఖర్చు పెట్టనున్న హృతిక్
Published on Dec 15, 2011 11:53 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?