టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘హృదయం లోపల’ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా ఈ పాట రాబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో రెచ్చిపోబోతున్నట్లు ఈ ప్రోమోలో హింట్ ఇచ్చారు. ఇక అనిరుధ్ రవిచందర్ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయనున్నాడు. ‘హృదయం లోపల’ సాంగ్ ప్రోమోను ఆయన పాడిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మే 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో విజయ్-భాగ్యశ్రీల రొమాన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి వీరి రొమాన్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫైర్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మే 30న ‘కింగ్డమ్’ను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి