‘అఖండ 2’లో ఈ స్పెషల్ ఎలిమెంట్ పై హాట్ డిస్కషన్!

నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ అంతా కూడా ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ చిత్రంలో ఒక స్పెషల్ ఎలిమెంట్ కోసం చర్చ నడుస్తుంది. మామూలుగా బాలయ్య, బోయపాటి సినిమాల్లో ఆయుధాలంటే స్పెషల్ క్రేజ్ ఉంది.

డిఫరెంట్ స్టైల్ ఆయుధాలు వీరి చిత్రాల్లో దర్శనం ఇచ్చి హైలైట్ అవుతాయి. మరి ఇలా అఖండ పార్ట్ 1 లో కూడా బాలయ్య అఘోర గెటప్ లో చేతబట్టిన త్రిశూలం కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు దానికి అడ్వాన్స్ వెర్షన్ ని బాలయ్య కోసం బోయపాటి స్పెషల్ గా డిజైన్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఇది చూడటానికి మరింత డిఫరెంట్ గా అదే విధంగా మైథాలజీ టచ్ తో కూడా ఉంటుందట. మరి అఖండ 2 లో బాలయ్య ఎలా దర్శనం ఇస్తారో చూడాలి.

Exit mobile version