పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ రాబోతున్న చిత్రం “యమహో యమ” షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుపుకుంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ హాలివుడ్ క్రిస్ట పర్ అట్కిన్స్ క్లాప్ కొట్టారు. అమెరికాలో జరుగుతున్న ఈ చిత్ర చితీకరణ షెడ్యూల్ ని ఈయన క్లాప్ తో మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ మే 1 వరకు జరుగుతుంది. పార్వతి మెల్టన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యముడిగా రియల్ స్టార్ శ్రీ హరి నటిస్తున్నారు. జితేందర్ వై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ గౌడ్ నిర్మిస్తున్నారు. మహతి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కామెడీ ప్రధానంగా సాగే కథగా ఉండబోతుంది.