నార్త్ అమెరికాలో తగ్గని ‘హిట్ 3’ జోరు.!

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా తెలుగు స్టేట్స్ నుంచి యూఎస్ మార్కెట్ వరకు రిలీజ్ అయ్యిన రోజు నుంచి సాలిడ్ వసూళ్లు అందుకుంటుంది. ఇలా హిట్ 3 జోరు యూఎస్ మార్కెట్ నార్త్ అమెరికాలో మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.

అక్కడ ఆల్రెడీ 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా మరో లక్ష డాలర్స్ ని అందుకొని 2.1 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకుంది. దీనితో అక్కడ మాత్రం ఈ సినిమా ర్యాంపేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా హిట్ పార్ట్ 4 లో కోలీవుడ్ నటుడు కార్తీ కనిపించనున్నాడు.

Exit mobile version