అదిరిపోయే ‘మిర్చి’ ఇంటర్వెల్ ఫైట్

అదిరిపోయే ‘మిర్చి’ ఇంటర్వెల్ ఫైట్

Published on Oct 30, 2012 12:29 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకందిస్తున్నాం. ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్లాక్ సీక్వెన్స్ ఫైట్ ని హై రేంజ్ మరియు హై వోల్టేజ్ తో చిత్రీకరించారు. సినిమా మొదటి నుంచి ఒక విధంగా పోతున్న సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ట్విస్ట్ తో కథ మలుపు తిరుగుతుంది, ఆ సమయంలో ప్రభాస్ యాంగ్రీ యంగ్ మాన్ గా కనిపిస్తారు.
మాటల రచయిత కొరటాల శివ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రభాస్ కి జోడీగా అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు. వంశీ కృష్ణా మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాని 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు