‘నయనతార’కి పెళ్లి.. నిజమేనా ?

‘నయనతార’కి పెళ్లి.. నిజమేనా ?

Published on Jun 20, 2020 10:57 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉండటం, పైగా ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తుంటారు. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైందనే వార్తలు గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట.

నయనతార పెళ్లికి రెడీ అవుతోందని, ఆగష్టులో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. లాక్ డౌన్ కి ముందు నయనతార జంట విదేశాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిపొయిందని కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయన్ లేదా విఘ్నేష్ ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు