లాభం తో డబ్బింగ్ మొదలుపెట్టిన విజయ్.

లాభం తో డబ్బింగ్ మొదలుపెట్టిన విజయ్.

Published on Aug 1, 2020 1:09 AM IST


కరోనా వైరస్ వలన అన్ని చిత్ర పరిశ్రమలలో పనులు స్థంభించి పోయాయి. షూటింగ్స్ కి పూర్తిగా బ్రేక్ పడగా, స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వచ్చే ఏడాది వరకు పూర్తి స్థాయిలో షూటింగ్స్ మొదలుకావని కొందరు అంచనా వేస్తున్నారు. ఐతే కొందరు హీరోలు భద్రతా నియమాల మధ్య షూటింగ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నారు.

కాగా వర్సిటైల్ హీరో విజయ్ సేతుపతి డబ్బింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. విజయ్ కి జంటగా శృతిహాసన్ నటిస్తుండగా లాభం అనే టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టారు విజయ్ సేతుపతి. విజయ్ సొంత నిర్మాణ సంస్థతో పాటు 7పీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై లాభం సినిమా నిర్మితమవుతోంది. జననాథన్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన షూటింగ్ పూర్తి చేసేలోపు సినిమా డబ్బింగ్‌, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయాలని మేకర్స్ భావించడంతో డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ మూవీలో విజయ్ సేతుపతి డీగ్లామర్ రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు