మెగా హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదిక చిన్ననాటి జ్ఞాపకం పంచుకున్నారు. తన తాతగారైన వెంకట్రావు గారితో దిగిన పాత ఫోటోని షేర్ చేశారు. ఏడెనిమిది ఏళ్ల వయసులో ఉన్న వరుణ్ తాత వడిలో కూర్చొని విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు దిగిన ఆ ఫొటోకి .. ‘తాత గారితో ఓ మంచి చిన్ననాటి జ్ఞాపకం’ అని క్యాప్షన్ ఇచ్చారు. చిన్న తనంలో వరుణ్ చాల క్యూట్ గా ఉన్నాడు.
ఇక గత ఏడాది గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న వరుణ్ నెక్స్ట్ మూవీలో బాక్సర్ గా కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకట్, సిద్దు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా, వైజాగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.
https://www.instagram.com/p/B_CYUnZDIOj/