స్టార్ హీరోలను కాదని, వాళ్లిద్దరూ టాప్ టెన్ లో..!

ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ ఆఫ్ హైదరాబాద్ 2019కి గానూ మోస్ట్ డిజైరబుల్ విమెన్ అండ్ మెన్ లిస్ట్ ప్రకటించింది. ఈ లిస్టులో మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా టాలీవుడ్ లక్కీ లేడీ సమంత టాప్ పొజిషన్ దక్కించుకుంది. ఇక మోస్ట్ డిజైరబుల్ మెన్ కేటగిరీలో విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. ఈ లిస్ట్ లో చరణ్ రెండవ స్థానం, ప్రభాస్ 4వ స్థానాల్లో నిలిచారు. రామ్ పోతినేని మూడవ స్థానం దక్కించుకోవడం విశేషం.

కాగా హీరో సుధీర్, యాంకర్ ప్రదీప్ టాప్ టెన్ లో చోటు సంపాదించి అందరినీ ఆశ్యర్యపరిచారు. ఎన్టీఆర్, మహేష్ వంటి టాప్ స్టార్స్ కి సైతం టాప్ టెన్ లో చోటు దక్కలేదు. కండలవీరుడు సుధీర్ బాబు గత ఏడాది 14వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరాడు. అనూహ్యంగా ప్రదీప్ 9వ స్థానంలో నిలిచి తన పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో నిరూపించుకున్నాడు. మహేష్ కి ఈ లిస్ట్ లో చోటు దక్కకపోగా, ఎన్టీఆర్ 19వ స్థానానికి పరిమితం అయ్యాడు.

Exit mobile version