సోను కు స్పెషల్ విషెస్ చెప్పిన ఎనర్జిటిక్ స్టార్..!

సోను కు స్పెషల్ విషెస్ చెప్పిన ఎనర్జిటిక్ స్టార్..!

Published on Jul 31, 2020 1:50 AM IST


గత కొన్ని రోజులుగా ప్రముఖ నటుడు సోనూ సూద్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కష్టం ఉంది అని ఎవరైనా చెప్తే చాలు ఏమాత్రం ఆలోచించకుండా ఎంతైనా సరే సహాయం చేయడానికి వెనుకాడకుండా ముందుకొస్తున్నారు.

దీనితో సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా కనిపించిన ఈ నటుడు నిజ జీవితంలో రియల్ హీరోగా నిలిచాడు. ఇదిలా ఉండగా ఈరోజు సోనూ సూద్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా అంతా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. అలాగే మన స్టార్ హీరోలు మరియు పేరుమోసిన రాజకీయ నాయకులు కూడా సోనూ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అయితే తన “కందిరీగ” సినిమాలో రామ్ తో సోనూ సూద్ నటించిన సంగతి తెలిసిందే. తన విలన్ కు ఎనర్జిటిక్ స్టార్ అందించిన విషెస్ మాత్రం కాస్త స్పెషల్ గా ఉన్నాయని చెప్పాలి. “మామూలు మనుషులూ ఉంటారు, హీరోలు ఉంటారు, కానీ వారితో పాటు మనసున్న నిజమైన మనుషులు కూడా ఉంటారు. ఇలాంటి మనసున్న నిజమైన మనుషులు ఉన్నప్పుడు ఇక మనకు హీరోలతో ఎలాంటి అవసరం ఉండదు. డియర్ బ్రదర్ సోనూ సూద్ నా వోట్ నీకే అని మాత్రం ఎవరికైనా గట్టిగా చెప్పగలను” అంటూ రామ్ సోనూ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా సోనూ పై మరిన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇకపోతే మా 123తెలుగు ద్వారా కూడా సోనూ సూద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరింత బలవంతుడు కావాలని కోరుకుంటున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు