ఈరోజు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి భారీ ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అలాగే వారితో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రతీ ఒక్కరూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా తెలిపారు.
అయితే రామ్ కాస్త లేట్ గా చెప్పినా తనదైన శైలిలో డిఫరెంట్ మార్క్ లో చెప్పారు. బాలయ్య బాబుకి అంటూ అందులో “బాబాయ్” అని వచ్చేలా ఆంగ్ల అక్షరాలతో విషెష్ తెలిపి బాలయ్య బోయపాటి నుంచి రాబోతున్న మూడో సినిమా కోసం ఎదురు చూస్తున్నా అని ఫినిష్ ఇచ్చారు. ఇలా రామ్ కాస్త లేట్ గా చెప్పినా లేటెస్ట్ గా విషెష్ అందించారని చెప్పాలి.