కార్తీ కష్టాలు.. వాయిదాలతో తికమక!

తమిళ హీరో కార్తీ వరుస ఫ్లాప్‌ల కారణంగా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. అయితే 2023లో ప్రారంభమైన అతని కొత్త సినిమా ‘వా వాతియర్’ మాత్రం వరుస వాయిదాలతో ఇబ్బంది పడుతోంది.

నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ విడుదలైనప్పటి నుంచి రిలీజ్ డేట్లు ప్రకటించడం, వాయిదా వేయడం పునరావృతమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఓటిటి హక్కులకు ఆశించిన రేట్ రాకపోవడంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా సినిమా రిలీజ్‌ను ముందుకు తీసుకురాలేకపోతున్నారట.

ఆయన వరుస ఫ్లాపులు డిజిటల్ కంపెనీలను కూడా వెనక్కి తగ్గేలా చేశాయని చెన్నై టాక్. సంక్రాంతి, జనవరి కూడా అసాధ్యం కావడంతో ఫిబ్రవరిలో నైనా ఈ హుషారైన పోలీస్ కథ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

Exit mobile version