‘వారణాసి’ టీమ్‌కు జక్కన్న స్పెషల్ థ్యాంక్స్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న ‘వారణాసి’ గ్లింప్స్ విడుదలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచం, కాన్సెప్ట్, థీమ్‌ను అద్భుతంగా చూపించిన ఈ వీడియో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. రాజమౌళి విజన్ మరియు అతని ప్రెజెంటేషన్‌కి సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా రాజమౌళి VFX మరియు టెక్నికల్ టీమ్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనౌన్స్మెంట్ వీడియోపై అద్భుతమైన పని చేసిన Mistyman Studios, వారి క్రియేటివ్ డైరెక్టర్ అలెక్స్ పీ, అలాగే జూలియా పర్యవేక్షణను ఆయన అభినందించారు. ఈ గ్లింప్స్ కోసం సహకరించిన మరికొన్ని వీఎఫ్ఎక్స్ కంపెనీలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇక తన టీమ్ సభ్యులు అయిన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస మోహన్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్‌. వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ మోహన్, సంగీత దర్శకుడు కీరవాణి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా, యానిమేషన్ సూపర్వైజర్ దీపక్, ఎడిటర్ తమ్మిరాజు, అలాగే కాన్సెప్ట్ డెవలప్ చేసిన ప్రతీక్‌కు రాజమౌళి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో రాజమౌళి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version