సినీ పరిశ్రమలో యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా డా. ఎం. మోహన్ బాబు మీడియా మరియు ‘మా’ సభ్యులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. నటుడు, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆయన క్రమశిక్షణ, అంకితభావం, నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విందులో అతిథులను అభిమానంతో ఆహ్వానించారు. ఈ అరుదైన మైలురాయిని అందరితో పంచుకోవడం పట్ల మోహన్ బాబు ఆనందం వ్యక్తం చేయగా, మీడియా – ‘మా’ సభ్యులు కూడా ఇందులో భాగమవడం పట్ల సంతోషం తెలిపారు.
నవంబర్ 22, 2025న “MB50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్” పేరుతో భారీ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. విష్ణు మంచు ఈ ఈవెంట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారని తెలుస్తోంది. మోహన్ బాబు 50 ఏళ్ల ప్రయాణాన్ని స్మరించుకునే ఈ కార్యక్రమానికి వివిధ పరిశ్రమల ప్రముఖులు హాజరుకానున్నారు.
