ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా వారు నాన్-తెలుగు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘EKO’కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుని నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
కేరళ కొండల్లో నడిచే ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే వినీత్, నరైన్, బిను పప్పు, అశోకన్, బియానా మొమిన్, సిమ్ జీ ఫీ, హుంగ్ షెన్, సహీర్ మొహమ్మద్, రంజిత్ శేఖర్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. డింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బహుల్ రమేష్ రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆరాద్యా స్టూడియోస్ బ్యానర్‌పై ఎంఆర్‌కే జయరామ్ నిర్మించగా ముజీబ్ మాజీడ్ సంగీతాన్ని అందించారు.
ఈ ప్రత్యేక భాగస్వామ్యంపై అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియా యార్లగడ్డ మాట్లాడుతూ.. “EKO వంటి సినిమాలు కొత్త ఆలోచనలను ఎందుకు ప్రోత్సహించాలనే దానికి ఉదాహరణ. మలయాళ చిత్రాన్ని మొదటిసారిగా డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు ఎంతో ముఖ్యమైన విషయం. ఏపీ, టీఎస్‌లో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించడం సంతోషంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
