రెండవసారి తండ్రి కాబోతున్న సౌత్ స్టార్ హీరో

రెండవసారి తండ్రి కాబోతున్న సౌత్ స్టార్ హీరో

Published on Oct 6, 2020 3:00 AM IST


తమిళం, తెలుగు రెండు భాషల్లో మంచి స్టార్ డమ్ ఉన్న హీరో కార్తీ. కార్తీ నుండి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా వైవిధ్యంగా ఉంటుందనే నమ్మకం ఉంది ప్రేక్షకుల్లో. అందుకే స్వతహాగా తమిళ హీరోనే అయినా తెలుగులో కూడ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఆయన గత చిత్రం ‘ఖైదీ’ తమిళంతో సమానంగా తెలుగునాట కూడ భారీ బ్లాక్ బస్టర్ అయింది. కార్తీ కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. వృత్తిరీత్యా ‘ఖైదీ’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆయన వ్యక్తిగత జీవితంలో అంతకుమించిన ఆనందంతో ఉన్నారు.

కారణం ఆయన రెండవసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి రంజనీ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. డెలివరీ డేట్ కూడ దగ్గరపడింది. అందుకే కార్తీ పనులన్నిటినీ పక్కనపెట్టేసి ఈరోడ్ నందు ఉన్న తన మామగారి ఇంట్లోనే ఉంటూ భార్యను చూసుకుంటున్నాడు. 2011లో వివాహం చేసుకున్న కార్తీ, రంజనీలకు 2013లో అమ్మాయి పుట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే కార్తీ ప్రస్తుతం ‘సుల్తాన్’ సినిమాచేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ ముగిసింది. త్వరలోనే మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణలో జాయిన్ కానున్నారు.

తాజా వార్తలు